పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం వంటి చిత్రాలు హీరోగా నిలబెట్టాయి. ఇది తర్వాత వచ్చిన తొలిప్రేమ లో బాలుగా యువతరాన్ని ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. పవన్ సినిమాల్లో ఏదో ఒక స్టైల్ తో వెరైటీ సంభాషణలతో యూత్ ని కట్టిపడేసారు. ఇది సామాన్య ప్రజలే కాకుండా అటు సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ ని ఇష్టపడుతున్నారు . అయితే పవన్కళ్యాణ్ నటిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


పవన్ కల్యాణ్ తెలుగు సిని నటుడు మరియు దర్శకుడు, అభిమానులు ప్రేమగా పవన్ స్టార్ అని పిలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా,  గబ్బర్ సింగ్, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్సిం గ్, కాటమరాయుడు మరియు ఆజ్ఞతవాసి వంటి సినిమాలలో నటించారు.



 అయితే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపైకి వకీల్ సాబ్ సినిమాతో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో  ఆడా మగా అనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అయితే ఈ రోజు వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజు ఉదయాన్నే లేచి మరి అభిమాని సినిమాకు వెళ్లారు. నరసాపురం అనే విలేజ్ లో ఒక థియేటర్ నిండా వకీల్ సాబ్ సినిమా చూడడానికి  ఆడవారు వచ్చారు.  ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో ని బట్టి చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎంతమంది అనేది.అయితే థియేటర్ నిండా ఆడవారు ఉండడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం


https://twitter.com/vinnesha/status/1380463265537351686?s=1002

మరింత సమాచారం తెలుసుకోండి: