సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార.. ప్రస్తుతం ఆమెకు ఓ స్టార్ హీరో కి ఉన్న మార్కెట్ సౌత్ ఇండియాలో ఉందని చెప్పవచ్చు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె పెట్టింది పేరుగా నిలుస్తోంది. కేవలం లేడి ఓరియెంటెడ్ సినిమాలే కాకుండా ఆమె స్టార్ హీరోల సరసన యంగ్ హీరోల సరసన కూడా నటిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకుంటుంది.. ఆమె సినిమాల పరంగా మంచి గుర్తింపే తెచ్చుకుంది కానీ పర్సనల్ లైఫ్ లో పలు వైఫల్యాలు ఆమెని క్రుంగతీశాయి..

అయితే వాటిని దాటుకొని ఇప్పుడు ఈ రేంజ్ హీరోయిన్ గా ఎదిగింది అంటే ఆమె సంకల్పం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. తన కెరీర్ తొలినాళ్లలో ఆమె హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే వెళ్ళిన వారి మధ్యలోనే ఆగిపోయింది.. ఆ డిప్రెషన్ నుంచి కోలుకుని మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది నయనతార..  ఆ తర్వాత కొన్ని రోజులకు ఆల్రెడీ పెళ్లయిన ప్రభుదేవాని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది నయనతార.. ఈ ఎఫైర్తో ఆమెకు చాలా బ్యాడ్రీ మార్క్స్ వచ్చాయి.. ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆమెను అందరూ విమర్శించారు.. దాంతో ఈ పెళ్లి కూడా పెటాకులైంది..

ప్రస్తుతం యువ దర్శకుడు విగ్నేష్  శివన్  తో పెళ్లికి సిద్ధమైంది.. గత కొన్ని రోజులుగా వారు డేటింగ్ లో ఉండగా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రతిరోజు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.. ఎప్పుడూ నోరు నయనతార తొలిసారి ప్రభుదేవాతో పై నోరు విప్పింది.. ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నా అసలు జీవితం మొదలైందని లేడీ సూపర్ స్టార్ చెప్పింది.. ఒక్కసారిగా జీవితం తలకిందులు అయిపోయిందా అనిపించింది.. కానీ ఆ సిచువేషన్ నుండి నేను బయటికి రావడానికి నా సన్నిహితులు చాలా సహాయం చేశారు అని నయనతార చెప్పింది..

మరింత సమాచారం తెలుసుకోండి: