తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు, వారిలో కొంతమంది ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం కోసం అనేక కష్టాలు పడుతూ ఉంటారు. తీరా అలా హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా  థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఆ హీరోయిన్లు కూడా కనుమరుగు అవుతూ ఉంటారు. మరి కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రం మొదటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద అ విజయాన్ని అందుకోలేక పోయిన, ఆ తర్వాత వారు ఎంచుకునే సినిమాలతో మంచి స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా మొదటి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతో పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఆ తర్వాత మాత్రం మంచి సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న బ్యూటీ లలో నభా నటేష్ ఒకరు. అందాల ముద్దుగుమ్మ నభానటేష్ తెలుగు ఇండస్ట్రీ లోకి సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రజలు పలకరించింది, కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు.

 ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాలు నభా నటేష్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చింది ,కానీ ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో నభా నటేష్ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.  ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగునాట క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న, సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది, తన అభిమానులతో తన షూటింగ్ అప్డేట్స్ ను మరియు ఇతర విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా నభా నటేష్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో నభా నటేష్ చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉంది. ఇలా నభా నటేష్ చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: