తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమారు 20 సంవత్సరాలకు పైగా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పారుమెగాస్టార్.ముఖ్యంగా ఆయన డాన్సులు, డైలాగ్స్ కి ఉండే క్రేజ్ మరో లెవెల్ అనే చెప్పాలి.యువ హీరోలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న చిరూ.. ప్రస్తుతం సీనియర్ హీరోగా టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించాడు.హీరోయిన్స్ తో కలిసి నటించే రొమాంటిక్ సీన్స్ లో ఎక్కడా కూడా హద్దులు దాటకుండా ఎంతో జాగ్రత్త పడతారు.

ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ కి ఆమడ దూరంలో ఉండే చిరంజీవి..ఓ సినిమాలో మాత్రం హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ లో నటించాడు.ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంతకీ ఆ సినిమా ఎంటనేదే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. చిరంజీవి లిప్ లాక్ సన్నివేశంలో నటించిన ఏకైక సినిమా 'ఘరానా మొగుడు'.చిరంజీవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కింది ఈ చిత్రం.ఈ సినిమాలో 'పండు పండు..అనే సూపర్ హిట్ సాంగ్ ఉంది.ఆ పాటలోనే హీరోయిన్ నగ్మా తో చిరంజీవి లిప్ లాక్ చేసాడు.అయితే లిప్ లాక్ చేయడం చిరూ కి అస్సలు ఇష్టం లేదట.చిరంజీవి వద్దు వద్దు అని చెప్తున్నా..

డైరెక్టర్ మాత్రం చేయాల్సిందే అని మొండికేసి మరీ చిరంజీవి దగ్గర ఆ లిప్ లాక్ సీన్ నటించేలా చేసారట దర్శకుడు.కానీ ఆ రోజు రాత్రంతా నిద్ర పోలేదు.వెంటనే మద్రాసుకు వచ్చి ఎడిటింగ్ ల్యాబ్ కి వెళ్లి ఆ లిప్ లాక్ సీన్ ను ఎడిట్ చేయించారట.అందుకే ఆ పాటలో ఎక్కడా మనకు ఆ లిప్ లాక్ సీన్ కనిపించదు.అలా మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలో హీరోయిన్ నగ్మా తో లిప్ లాక్ సీన్ లో నటించాడు. కాకపోతే సినిమాలో దాన్ని ఎడిట్ చేసేసారు.ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమా విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో జాయిన్ కానున్నాడు చిరు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: