నమిత ఈ పేరు మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్స్తుంది పైగా నమిత అంటే..

హాట్ బ్యూటీతో పాటు బిజినెస్ బ్యూటీ కూడా అని తెలుస్తుంది . ఇప్పటికే తన పేరు మీద ఓ ఓటీటీ సంస్థ పెట్టిందని సమాచారం. అదేంటి ఎవరికీ తెలియదే అని అనిపిస్తుంది కదా..నమిత అభిమానులు ఆ ఓటీటీని బాగా సక్సెస్ చేశారని ఈ ముక్క కూడా నమితే చెప్పుకొచ్చిందట ఇక ఆ మధ్య తన పేరు మీద ఓ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేసి.. ఏవో నాలుగు బూతు కథలను ఎంపిక చేసుకుని ఓటీటీ సినిమాలు చేయాలని తెగ ప్రయత్నాలు చేసిందని తెలుస్తుంది..



అయితే, అటు ఓటీటీ పనులతో పాటు ఇటు సినీ నిర్మాణ పనులను చూసుకోలేక నమిత మధ్యలో రెండిటినీ ఆపేసిందని తెలుస్తుంది . మళ్ళీ ఆ పనులను మొదలుపెట్టడానికి కసరత్తులు స్టార్ట్ చేసిందట అందుకే ఈ బిజీ పనులతో ప్రస్తుతం తీరక లేకుండా గడుపుతుందని సమాచారం. దాంతో నమిత భర్త కొంచెం ఫీల్ అవుతున్నాడని తెలుస్తుంది. నమిత తనకు తగిన సమయాన్ని కేటాయించట్లేదు అంటూ తెగ బాధ పడుతున్నాడని సమాచారం.

ఎప్పుడు మేనేజర్లతోనే టైమ్ స్పెండ్ చేస్తోందని నమిత భర్త మొత్తానికి బాధ పడుతున్నాడని సమాచారం.. ఇక నమిత ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న మొదటి సినిమా పేరు ఏమిటి అంటే ? 'బౌ.. వావ్'. ఇదేంటి ఇదేదో కుక్క సినిమాలా ఉంది అనిపిస్తోందా ఏమిటి అవును, ఈ కథ కుక్కకి ఓ అమ్మాయికి మధ్య జరిగే కథ అని  కుక్క మనిషిలా ప్రవర్తిస్తే ఏమిటి  అనే కోణంలో సినిమా ఉంటుందని సమాచారం

ఇందులో నమితనే లీడ్ రోల్ చేస్తోందని తెలుస్తుంది.నమిత తర్వాత స్థానం కుక్కదేనని మొత్తమ్మీద నమిత(Namitha) -కుక్క మధ్య లవ్ స్టోరీ అని తెలుస్తుంది.. పైగా ఈ సినిమాను 5-6 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారని తన సొంత బ్యానర్ తో పాటు, దాని పై నిర్మిస్తున్న సినిమా కథలను నమిత చాలా కొత్తగా తీసుకుంటుందని తెలుస్తుంది.. అన్నట్టు అమెజాన్ ప్రైమ్, ఆహాకు పోటీగా తాము కూడా సినిమాలు కొని స్ట్రీమింగ్ కు పెడతామని నమిత చెబుతుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: