తొలిసారిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి యువ భామ రష్మిక మందన్న జోడీ కడుతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న పుష్పలో రష్మిక, శ్రీవల్లి అనే గిరిజన యువతిగా కనిపించనుండగా పుష్ప రాజ్ అనే లారీ క్లానర్ పాత్రలో అల్లు అర్జున్ కనువిందు చేయనున్నారు. సుకుమార్ తీస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్ బ్యానేర్ పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, ధనుంజయ,సునీల్ తదితరులు విలన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రీ లూడ్ టీజర్, అలానే మూడు సాంగ్స్ అందరినీ ఎంతో అలరించి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. తొలిసారిగా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ భారీ సినిమాపై పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉండడం విశేషం. ఇక ఈ సినిమాని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా ఎంతో భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు ఇటీవల పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది.

అయితే పుష్ప హిందీ రిలీజ్ కి సంబంధించి కొద్దిపాటి సమస్యలు తలెత్తాయని, అవి సర్దుమణగడానికి మరికొంత సమయం పట్టనుండడంతో మూవీని ఇంకొన్నాళ్లపాటు వాయిదా వేయనున్నారు అంటూ రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దీనిపై స్పందించిన యూనిట్, అవి కేవలం ఒట్టి పుకార్లు మాత్రమే అని, ముందుగా తాము ప్రకటించిన మాదిరిగా పుష్ప పక్కాగా డిసెంబర్ 17నే విడుదల అవుతుందని మరొక్కసారి కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా మరొక నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: