కింగ్ నాగార్జున నవమన్మధుడు మాత్రమే కాదు మాస్ సినిమాలలో కూడా ఇట్టే సెట్ అవుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. సాధారణంగా ఈయన మాస్ సినిమాలతోనే తన సినీ కెరీర్ మొదలు పెట్టాడు. ఇక తర్వాత లవ్ ,రొమాంటిక్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి, యువతను ఆకట్టుకోవడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిలు హృదయాలను దోచుకున్న నవమన్మధుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే నాగార్జున ఏ సినిమాలో ఏ పాత్రలో నటించినప్పటికీ కచ్చితంగా ఆ పాత్ర లేదా ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటాడు. ఒకవైపు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు యువతను కూడా తన సినిమాలతో పిచ్చెక్కించే కెపాసిటీ నాగార్జున కు మాత్రమే ఉందని చెప్పాలి. నాగార్జున కు సంబంధించి మాస్ ఆడియన్స్ లో వుండే ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. అలా మాస్ చిత్రాలలో  నాగార్జున నటించిన డాన్ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. హీరో నాగార్జున,  రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో అప్పటికే మాస్ చిత్రం వచ్చి తెలుగు ప్రేక్షకులను, మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుంటుందని తెరకెక్కించిన చిత్రమే డాన్.


2007 డిసెంబర్ 20వ తేదీన తెలుగు మాస్ చిత్రంగా తెరకెక్కిన డాన్ సినిమా  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. హీరోయిన్ గా అనుష్క, నాగార్జున హీరోగా నటించి మెప్పించారు. రాఘవ లారెన్స్ ,నిఖిత ,నాజర్, కెల్లీ డోర్జీ, చలపతిరావు ,జీవ, కోట శ్రీనివాసరావు, సుప్రీత్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కూడా రాఘవ లారెన్స్ వ్యవహరించడం గమనార్హం. రాయల్ ఫిలిం కంపెనీ శ్రీకాంత్ , కీర్తి క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక మాస్ ఆడియన్స్ ని బాగా మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: