ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగు వెండి తెరపై విడుదలయిన కేజిఎఫ్ మూవీ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మూవీ తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఊహించని ఇంపాక్ట్ చూపింది. స్టోరీ ఎంత బలంగా అయితే ఉందో, హీరో నటన అంతకు మించిన స్థాయిలో ఉంది. ఈ సినిమాలో యశ్ చూపించిన వేరియేషన్స్ వేరే లెవల్ అనే చెప్పాలి. సైలెంట్ గా వచ్చిన ఈ యంగ్ హీరో ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా ఎదిగి సత్తా చాటాడు. పాటలు కూడా హైలెట్ గా మారి సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చూస్తే దర్శకుడు ప్రశాంత్ నీల్ యొక్క స్టామినా ఏంటో అన్న విషయం అర్థమైపోతుంది.
ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసి వచ్చి ఈ చిత్రంతో యశ్ తెలుగులో క్రేజీ హీరోగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కసారిగా టాలీవుడ్ లో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ కేజిఫ్ చాప్టర్ 2 తో బిజీగా ఉన్నారు యశ్. త్వరలో ఈ సినిమా మన మన ముందుకు రానుంది. ఈ ఒక్క సినిమా తన కెరియర్ నే మార్చేసిందని చెప్పాలి. అంతకు ముందు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించే యశ్ పేరు కే జి ఎఫ్ మూవీ తర్వాత ఇతర ఇండస్ట్రీలోను మారుమ్రోగుతోంది.