ప్రస్తుతం ఉన్న సినీ ప్రేక్షకులు అందరికి కూడా నేటి రోజుల్లో హీరోయిన్ల గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక నిన్నటి తరం మొన్నటి తరం హీరోయిన్లలో చాలామంది ప్రేక్షకులకు సుపరిచితులే. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటి హీరోయిన్ గా నటించింది ఎవరు అనేది మాత్రం చాలామందికి తెలియదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటి హీరోయిన్ గా నటించడమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కమలాబాయి. కేవలం నటిగా మాత్రమే కాదు తన గాత్ర దానంతో కూడా ఎన్నో పాటలు పాడి అందరిని అలరించింది.



 నాట్యకళలో ఎంతగానో ప్రావీణ్యం ఉన్న కమలాబాయి ప్రేక్షకులందరినీ తన ప్రతిభతో కట్టిపడేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటి హీరోయిన్ గా పేరుప్రఖ్యాతులు సాధించిన కమలాబాయి జననం ఎంతో ఆసక్తి కరమైనది అని చెప్పాలి.  గుంటూరులో 1908లో సురభి నాటక సంస్థ వారు ఒక నాటకం వేయగామ్. ఇక అదే నాటకంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక మహిళ కు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తెర దించి అక్కడ వున్న మిగతా మహిళలు ఆమెకు అక్కడే స్టేజ్ మీద ప్రసవం  చేశారు.  ఇలా ఏకంగా పుట్టుకతోనే ఒక నాటకరంగం స్టేజ్ మీద పుట్టింది కమలాబాయి.



 తర్వాత తెలుగు చిత్ర దేశంలో మొట్టమొదటి హీరోయిన్ గా మారిపోయింది. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా భక్త ప్రహ్లాద సినిమాలు లీలావతి పాత్రలో నటించిన కమలాబాయి  తన నటనతో పాత్రకు ప్రాణం పోసింది అని చెప్పాలి. అదే సమయంలో పాతాళభైరవి సినిమాలో తోట రాముడికి తల్లి పాత్రలో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. 1953 లో వచ్చిన అమ్మలక్కలు చిత్రంలో కూడా ప్రధాన పాత్రలో నటించింది కమలాబాయి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి హీరోయిన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కమలాబాయి ఇక ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: