విజయ్ దేవరకొండ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో చేస్తూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా సోలో హీరోగా మారి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ శాలిని పాండే తో కలసి అర్జున్ రెడ్డి సినిమాలో ఈయన చేసిన రొమాన్స్ కు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. ఇక ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో గా చెలామణి అయిన ఈ రౌడీ హీరో ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ని రోల్ మోడల్ గా తీసుకున్న ఈయన అన్ని పాన్ ఇండియా సినిమా కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఎప్పుడు క్రిస్మస్ పండక్కి సహాయం చేసే విజయ్ దేవరకొండ ఈసారి కూడా దేవర శాంటా  పేరుతో వంద మందికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చాడు. ఇకపోతే 2021 క్రిస్మస్ కి విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కు అదికూడా ముఖ్యంగా ఇబ్బందుల్లో ఉన్న వంద మందికి మనిషికి రూ.10వేలు చొప్పున సహాయం చేస్తానని ప్రకటించారు.. అంతే కాదు నిజంగా డబ్బు అవసరమయ్యే ఆర్థిక కష్టాల్లో ఉన్న వారు తోటి వ్యక్తుల పేర్లు చెప్పాలని రౌడీ స్టార్ తెలిపారు.. ఇక ఈ నేపథ్యంలోనే అన్న మాట ప్రకారం ఆయన ఏకంగా పది లక్షల రూపాయలను వందమందికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు..

ఇకపోతే తాజాగా మై లవ్ దేవర్ శాంటా లిస్టులో మీ పేరు కూడా ఉందా లేదో చూసుకోండి.. త్వరలోనే మా టీం సభ్యులు మిమ్మల్ని సంప్రదించి మేము ఇస్తామని ప్రకటించిన మీకు రావాల్సిన పదివేల రూపాయలు మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఏది ఏమైనా రౌడీ స్టార్ మనసు చాలా మంచిది అంటూ నెటిజన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: