అవతార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..భారీ యాక్షన్ మూవిగా తెరకెక్కిన భారీ బడ్జెట్ హాలివుడ్ మూవీ.. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది.కానీ ఇప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ మాత్రం తగ్గలేదు.అయితే ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమానే అవతార్ 2..దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం విడులకు సిద్ధంగా ఉంది. మొదటి సినిమా కన్నా కూడా ఎక్కువ వండర్స్ ను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది.
 

అనేక భాషల్లోకి డబ్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ఆస్కార్ వేదికపైనా అవార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అవతార్-2(ది వే ఆఫ్ వాటర్) ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది... కాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. ఈ ట్రైలర్‌ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి.


ట్రైలర్‌ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్‌గానే ఉంచారు.ట్రైలర్ సన్నీవేశాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాంతో సినిమా పై జనాలకు ఆసక్తి భారీగా పెరిగి పోయింది.అవతార్-2 చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇక 2024లో అవతార్‌ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్‌ 5 సినిమాలు రిలీజ్ చేయనున్నారు...మొత్తానికి ఈ సినిమా కూడా అద్బుతమైన విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి...




మరింత సమాచారం తెలుసుకోండి: