ఇప్పటికి ఎఫ్ త్రీ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించాయి. అలాగే చిత్రబృందం ఇప్పటివరకు వరుస ఇంటర్వ్యూ లతో ఈ సినిమా మంచి హైఫ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల చేశారు. హత్ మే పైసా.. సాంగ్ ఎప్పుడు బాగా వైరల్ గా మారుతుంది. పార్టీ కలర్ఫుల్ గా డిజైన్ చేయబడిన ఈ పాట ప్రస్తుతం చాలా ట్రెండీగా అవుతోంది. ఈ పాటని సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ చేశారు.
ఇక ఈ వీడియోలో వరుణ్ తేజ్, వెంకటేష్ తో కలిసి పూజా హెగ్డే స్టెప్పులు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ స్టైల్ లో ఈ సినిమా లోని డాన్స్ చాలా హైలెట్ గా నిలుస్తోంది. పూజా హెగ్డే పొట్టి పొట్టి దుస్తులతో తన గ్లామర్ ను అందించేలా కనిపిస్తోంది. ఈ పాట చివర్లో వరుణ్ తేజ్ ఈ సినిమాలోని తన పాత్రకు తగ్గట్టుగా నటితో పాడుతూ ప్రేక్షకులను బాగా నవ్వించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటకి ట్యూన్ కంపోజ్ చేశారు.