ఇటీవలే కాలంలో సినిమాలు ధియేటర్ లలో విడుదల అవడం పదిరోజులు తిరగకముందే ఆ సినిమా ఓటీటీ లోకి రావడం జరుగుతుంది. దీని ద్వారా సినిమా పరిశ్రమకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసినా నిర్వాహకులు సినిమాలను ఇలా విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు ఎలాగో పదిరోజులు పోతే సినిమా ఓటీటీలోకి వస్తుంది కదా అని ఏమాత్రం ధియేటర్ లకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. మరి ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో తెలీదు కానీ నాని అంటే సుందరానికి సినిమా మాత్రం ఈ విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల పదో తేదీన విడుదల కాబోతుండగా తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అన్న నమ్మకంతో సినిమా యూనిట్ ఉంది. ఈ సినిమా లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నాని లాంటి హీరో తో పాటు మంచి క్రేజ్ ఉన్న మలయాళ హీరోయిన్ నజ్రియా కూడా ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా కి వేరే టాక్ వచ్చే ఛాన్స్ లేదని నాని అభిమానులు నమ్ముతున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ ను డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా కేవలం పదిరోజుల వ్యవహిలోనే అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుందని కూడా చెప్పారు దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ పై ఇది ఎంతో ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ను తొందరగా విడుదల చేయడానికి ఏ ఓటీటీ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని వెల్లడించింది. పరిస్థితులను బట్టి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుందో చెప్తాము అన్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: