నవయువ సామ్రాట్ అఖిల్ హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర చేస్తుండగా టాలీవుడ్ లోని పలువురు ముఖ్య నటులు ఇతర పాత్రలు చేస్తున్నట్లు టాక్. ఇటీవల మెగాస్టార్ తో పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డి తెరకేకించిన సురేందర్ రెడ్డి తీస్తున్న ఏజెంట్ మూవీకి హిప్ హాఫ్ తమిజా సంగీతం అందిస్తుండగా రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు .

ప్రారంభం నాటి నుండి అందరిలో కూడా మంచి అంచనాలు ఏర్పరిచింది ఏజెంట్ మూవీ. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఏజెంట్ మూవీలో అఖిల్ అక్కినేని రా ఏజెంట్ గా నటిస్తున్నారని,ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలు అయితే ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేస్తాయని సమాచారం. మరోవైపు కెరీర్ పరంగా ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన అఖిల్ సహా యావత్ అక్కినేని కుటుంబం మొత్తం కూడా ఏజెంట్ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకోగా, అందరి అంచనాలు అందుకునేలా అద్భుతంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమా కోసం అఖిల్ భారీగా బాడీ పెంచడంతో పాటు లాంగ్ హెయిర్ తో కూడా కనపడనున్నారు. ఒకరకంగా ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత హీరో అఖిల్ రేంజ్ ని మరింతగా పెంచుతుందని ఇన్నర్ వర్గాల న్యూస్. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఏజెంట్ మూవీ ఈ ఏడాది దసరాకి విడుదల కానున్నట్లు టాక్. ఇక అతి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కానున్న ఏజెంట్ మూవీ, అనంతరం రిలీజ్ తరువాత ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: