
బాలకృష్ణ మాస్, ఫ్యామిలీ మూవీస్‌తో పాటు 'శ్రీరామరాజ్యం' లాంటి భక్తి రసాత్మక చిత్రాలు, 'ఆదిత్య 369' లాంటి సైన్స్ ఫిక్షన్ డ్రామాస్ కూడా చేశాడు. ఇక కెరీర్లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయిన 100వ సినిమాకి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నాడు. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితగాథని తెరకెక్కించాడు బాలయ్య. బాలకృష్ణ కొత్తగా ట్రై చేయాలనే ప్రయత్నాలతో బోల్తాపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. లాజిక్స్ పక్కనపెట్టి మేజిక్స్ చేద్దాం అనుకున్న దర్శకులతో కలిసి ఫ్లాపులని కూడా చూశాడు. అయితే ఫ్లాపులు వచ్చినా, హిట్స్ వచ్చినా.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్‌తో ఈక్వేషన్ మ్యాచ్ అయితే చాలు మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తూనే ఉంటాడు.
బాలకృష్ణ డిక్షనరీలో నో అనే మాట వినిపించదు. యాక్షన్ సీన్స్ అయినా, డాన్స్ మూమెంట్స్ అయినా మరొకటైనా చేసేద్దాం అనే ఎనర్జీతోనే ఉంటాడు. నా వల్ల అవుతుందా.. చేయగలనా అనే ప్రశ్నలని దగ్గరికి రానివ్వడు. అందుకే సిక్స్టీ ప్లస్‌లో కూడా యంగ్స్టర్లా హుషారుగా పరుగులు పెడుతున్నాడు. వరుస సినిమాలతో అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నాడు. బాలకృష్ణ ఎనర్జీని కరెక్ట్‌గా వాడుకుంటే బాక్సాఫీస్ హిట్ గ్యారెంటీ అని అభిమానులు బలంగా నమ్ముతారు. ఇక ఈ పొటెన్షియాలిటీని బోయపాటి శ్రీను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటాడు. ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. బాలక్రిష్ణని యాక్షన్కా బాప్లా చూపిస్తున్నాడు.
గోపీచంద్ మలినేని సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. యంగ్ లుక్‌లో ఒక క్యారెక్టర్, సాల్ట్ అండ్ పెప్సర్ లుక్‌లో మరో క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వచ్చిన స్టిల్స్, టీజర్‌తో సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌కి వెళ్లాయి. బాలయ్య మార్క్ డైలాగులు అభిమానులకి ఎనర్జీ ఇస్తున్నాయి. బాలకృష్ణ నెక్ట్స్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు కామెడీ ఎంటర్టైనర్స్ చేసిన అనిల్ రావిపూడి ఈ మూవీతో కంప్లీట్ యాక్షన్ జానర్లోకి వెళ్తున్నాడు. గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్‌కాగానే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడట బాలయ్య.