పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. అలా వరుస సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కంటే కూడా రాజకీయాల పైనే దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిన సినిమాలను అలాగే కమిట్ అయిన సినిమాలను కూడా కొన్ని రోజుల పాటు హోల్డ్ లో పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' మూవీ షూటింగ్ ను కొంత భాగం పూర్తి చేశాడు. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ కాబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కాక పోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే కూడా రాజకీయాల వైపు దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.  పవన్ కళ్యాణ్మూవీ తో పాటు వినోదయ సీతం అనే తమిళ మూవీ ని తెలుగులో రీమేక్ చేయడానికి కూడా కమిట్ అయ్యాడు. ఈ మూవీ ను కూడా మరి కొన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమా లతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీలో నటించబోతున్న ఈ విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో భవదీయుడు భగత్ సింగ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ ఫైనల్ కథను వినిపించినట్లు , పవన్ కళ్యాణ్ ఆ కథలో కొన్ని మార్పులు ... చేర్పులను సూచించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: