బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ అయిన సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆదిత్య 369 ఈ సినిమా అప్పట్లో ఎంత ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా సిపిఎల్ తెరకెక్కించబోతున్నట్లు పలు కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో డైరెక్టర్ కథా రెడీ చేస్తే నేను సిద్ధంగానే ఉన్నాను అని బాలకృష్ణ ఓపెన్ గా తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయం బాలకృష్ణ గడిచిన మూడేళ్ల క్రితం తెలియజేశారు. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్టు పైన మరి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అసలు ఈ సినిమా సీక్వెల్ కు కథ రెడీగా ఉందా.. వీరి కాంబినేషన్ సాధ్యమేనా అన్నట్లుగా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి సినీ ప్రేక్షకులలో.


ప్రస్తుతం డైరెక్టర్ వయసు 90 సంవత్సరాలు మరి ఈ వయసులో సినిమా సాధ్యమేనా అప్పుడున్నంత యాక్టివ్ గా ఇప్పుడు ఈ సినిమా సాధ్యమయ్యేనా అనే సందేహాలు అభిమానులలో వెంటాడుతూ ఉన్నాయి. ఆయన చివరిగా 2013లో వెల్కమ్ ఒబామా సినిమాని తెరకెక్కించారు ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా కూడా చేయలేదు అయితే వయసు 90 క్రాస్ అవుతున్నప్పటికీ చాలా యాక్టివ్గానే ఉన్నారు సింగీతం శ్రీనివాసరావు.


హెల్త్ పరంగా కూడా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు అయితే ఆదిత్య 369 సీక్వెల్ పైన ఈ వయసులో ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేయగలిగితే వాటిని తెరపైకి తీసుకురావడం అన్నది అంత ఆశ మాషి విషయం కాదు.. టెక్నాలజీ పరంగా ఈ సినిమాకు హై స్టాండర్స్ మలచాలి.. సాంకేతిక విషయాల పైన ఎంతో పట్టు ఉండడమే కాకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇక ఖర్చు విషయం కూడా అందుకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు.. వీటన్నిటిని అధిగమించి సినిమా కెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే బాలకృష్ణ తన 110 వ సినిమా చేరువవున నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లుగా నందమూరి వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే బాలయ్యే స్పందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: