దుల్కర్ సల్మాన్ హీరోగా, మ్రుణాల్ ఠాగూర్, రష్మిక కలిసి నటించిన చిత్రం సీతారామం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హాను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు-5న విడుదల మంచి టాక్ తో దూసుకుపోతున్నది. అద్భుతమైన ప్రేమ కథ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ ఎంత అద్భుతంగా నటించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకోవడం ఖాయమని పలువురు సైతం అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిన సీత పాత్ర కోసం మొదట మృణాల్ ని అనుకోలేదట.


మొదట సీత పాత్ర కోసం పూజ హెగ్డే అని అనుకున్నారట చిత్ర బంధం కానీ కరోనా సమయంలో ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పాత్ర నచ్చినప్పటికీ తప్పని పరిస్థితుల్లో పూజ హెగ్డే ఈ సినిమాకు నో చెప్పిందని సమాచారం ఇక పూజ హెగ్డే చేయవలసిన పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ నటించింది దీంతో ఈమెకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. ఒకవేళ ఈ సినిమాలో పూజ హెగ్డే నటించి ఉంటే ఈ పాత్రకు మరింత క్రేజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.ఇదంతా ఇలా ఉంటే సీతారామం సినిమా ప్రస్తుతం హౌస్ ఫుల్ షో దూసుకుపోతోంది.. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా హీరోయిన్ పూజా హెగ్డే ఒక బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకొని తప్పు చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పూజ హెగ్డే విషయానికి వస్తే.. మహేష్ బాబుతో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందుకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా అయిపోయాయి. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ వంటి చిత్రాలు ఫ్లాప్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: