ఈక్రమంలోనే రష్మి గౌతమ్ నటించిన గుంటూరు టాకీస్ సినిమా అయితే ప్రేక్షకులు ఎప్పుడూ మరిచిపోలేరు. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చేసిన అందాల ఆరబోత ఇప్పటికి కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన రష్మీ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. అయితే గుంటూరు టాకీస్ సినిమా లో హీరో తో లిప్ లాక్ సన్నివేశాలు విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చాయి అయితే ఈ లిప్ లాక్ సన్నివేశాలు గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రష్మి గౌతమ్ కి ముందుగా చెప్పలేదట.
చెప్పకుండానే ఇక లిప్ లాక్ సన్నివేశాలను చిత్రీకరించారు అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన రష్మి గౌతమ్ క్లారిటీ ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ముందుగా సన్నివేశాన్ని వివరించిన తర్వాత షూటింగ్ జరిగింది అంటూ తెలిపింది. అయితే ఆ పాత్రకి లిప్ లాక్ సన్నివేశం అవసరం కాబట్టి చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది రష్మి. అయితే అందాల ఆరబోత ద్వారా మరిన్ని అవకాశాలు అందుకోవాలని భావించిన రష్మికి నిరాశే ఎదురైంది. ఇక అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గానే సరిపెట్టుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది ఈ అమ్మడు.