టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఇప్పటికే కెరీర్ లో ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా విమల్ కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి , కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది.

మూవీ లో సిద్దు జొన్నలగడ్డ స్లాంగ్ , బాడీ లాంగ్వేజ్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ ద్వారా సిద్దు జొన్నలగడ్డ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న డీజే టిల్లు మూవీ కి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారు. డీజే టిల్లు మూవీ కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా , డీజే టిల్లు సీక్వెల్ నుంచి ఈ దర్శకుడు తప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే డీజే టిల్లు మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. నేహా శెట్టి కూడా డీజే టిల్లు సీక్వెల్ లో కనిపించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే డీజే టిల్లు సీక్వెల్ లో  టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: