వినాయకచవితి పండుగ పేరు వినగానే పెద్దగా పూజలు చేయని వ్యక్తులు కూడ మంచి ఉత్సాహాన్ని పొందుతారు. వినాయకుని రూపాలను రకరకాలుగా తీర్చిదిద్దుతూ తయారుచేయబడ్డ భారీ విగ్రహాల సందడి వినాయకచవితి ప్రాముఖ్యత. భారీ విగ్రహాలు మాత్రమే కాదు శుభకార్యాల సందర్భంలో బహుమతులుగా ఇచ్చే బహుమతులలో కూడ కొన్ని వేల రకాలు మనకు మార్కెట్ లో కనిపిస్తూ ఆకర్షిస్తూ ఉంటాయి.


ఏ శుభకార్యం మొదలుపెట్టాలని అనుకున్నా గణేష్ ని పూజతోనే ప్రారంభం అవుతుంది. మరీ ముఖ్యంగా వినాయకచవితి ని మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటిలోనూ గణేష్ ని పండుగ సందడి కనిపిస్తుంది. భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు ‘వినాయకచవితి’ గా మనం పరిగణిస్తాం. చవితి సందర్భంగా నవరాత్రులు వైభవంగా జరిగి ఆతరువాత గణేష్ నిమర్జనం తో చవితి హడావిడి ముగిస్తుంది.


విఘ్నాధిపతిగా వినాయకుడిని పూజించడం వెనుక ఒక పరమార్థం ఉంది. నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే అన్ని పవిత్ర నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని వినాయక వ్రత మనకు తెలియచేస్తుంది. జ్ఞానానికి ప్రతిరూపం వినాయకుడు. గణేష్ నికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ప్రసాదం లేకుండా పండుగ ప్రాముఖ్యత ఉండదు. ప్రతి ఇంటిలోనూ అందరు కలిసి జరుపుకునే ఈ వినాయక పూజలో 21 రకాల పత్రి ఆకులతో గణేష్ డుని పూజిస్తారు. సంతాన గణపతి బాలగణపతి విద్యాగణపతి ఐశ్వర్య గణపతి మోక్ష గణపతి ఇలా అనేక రూపాలతో గణపతిని ఆరాధించడం యుగయుగాల నుండి హైందవ సంస్కృతిలో ఒక భాగం.



వినాయకచావితిని కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా మలేషియా ఇండోనేషియా దేశాలలోని ప్రజలు కూడ గణపతిని ఆరాధిస్తారు. ముఖ్యంగా ముంబాయ్ పట్టణంలో నిర్మించే గణేష్ మండపాలలో కోట్లాది రూపాయలు విలువచేసే బంగారం వజ్రాలు నవరత్నాలతో గణేష్ మండపాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. స్వాతంత్రోద్యమ సమయంలో గోపాల కృష్ణ గోఖలే గణేష్ మండపాలకు వచ్చే భక్తుల ద్వారా స్వాతంత్రోధ్యమ స్పూర్తిని 1920 ప్రాంతాలలోనే తీసుకు వచ్చిన సందర్భాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి. ఈ వినాయక చవితి పండుగ అందరికీ సుఖ సంతోషాలు ఆ గణేష్ డు ప్రసాదించాలని ఇండియా హెరాల్డ్ కోరుకుంటూ అందరికీ ‘వినాయకచవితి శుభాకాంక్షలు’..



మరింత సమాచారం తెలుసుకోండి: