తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి  మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడు గా గుర్తింపు ను తెచ్చుకున్న సత్య దేవ్మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. 

అక్టోబర్ 5 వ తేదీన గాడ్ ఫాదర్ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ యూనిట్ చేసింది. గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ ని ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన సాయంత్రం 8 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. గాడ్ ఫాదర్ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: