టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'యశోద'. 'శ్రీదేవి మూవీస్' బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న విడుదల అయ్యింది.సరోగసి  నేపథ్యంలో సాగే కథాంశంతో ఇంకా అలాగే సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయి.ఫస్ట్ డే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.కానీ సోమవారం నాటి నుండి సినిమా బాగా డల్ అయ్యింది.ఎందుకంటే టాలీవుడ్ లెజెండరి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది.ఈ 'యశోద' సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.20.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.


మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే పలు చోట్ల ఈ సినిమాని రెంటల్ బేస్ పైన ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు.ఇంకొన్ని చోట్ల అయితే అడ్వాన్స్ ల బేసిస్ మీదే విడుదల చేశారు. అందువల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్లుగా ఉందని ట్రేడ్ పండితుల నుంచి సమాచారం తెలుస్తుంది.అయితే 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ మొత్తం రూ.10.3 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఓవర్సీస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి మంచి లాభాలు అందించింది. ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ తర్వాత ఈ మూవీ చాలా డౌన్ అయ్యింది. రెండో వీకెండ్ ను వాడుకుంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ సినిమా ఫైనల్ వసూళ్లు ఎలా ఉంటాయో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: