నాని ఇండస్ట్రీలోకి దర్శకుడు అవుదామని వచ్చాడు. క్లాప్ బోయ్ నుండి మొదలుపెట్టి సహాయ దర్శకుడు వరకు చాల కష్టపడుతున్న పరిస్థితులలో అనుకోకుండా అదృష్టం తలుపు తట్టడంతో నాని హీరోగా మారిపోయాడు. దర్శకుడు కాలేకపోయాను అని నానికి ఉన్న అసంతృప్తిని నాని సోదరి దీప్తి గంటా తీరుస్తోంది.


సినిమా మేకింగ్ పై విపరీతమైన ఆశక్తి ఉన్న దీప్తి తీసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ జనానికి బాగా నచ్చడంతో ఆమె టాలెంట్ ను ప్రోత్సహించాలి అన్న నిర్ణయం తీసుకున్న నాని ఆమెను వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించే స్థాయికి తీసుకు వచ్చాడు. వారానికి సుమారు అరడజను సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ అవుతున్న పరిస్థితులలో ఓటీటీ సంస్థలు పెడుతున్న కండిషన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి.


ఇప్పటికే చాల ఓటీటీ సంస్థలు ఆంథాలజీ కథలను ఓటీటీ ప్రసారానికి పెద్దగా తీసుకోవడంలేదు. అయితే నాని సోదరి ఆంథాలజీ కథలను వెబ్ సిరీస్ గా మారిస్తే సోనీ లీవ్ సంస్థ స్ట్రీమ్ చేయడానికి అంగీకరించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. మీట్ క్యూట్ పేరుతో ఆమె రూపొందించిన వెబ్ సిరీస్ ను నాని అన్నింటా తానై తన సోదరితో కలిసి ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా నాని ఇస్తున్న ఇంటర్వ్యూలలో అతడికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.


ఆంథాలజీ కథలకు క్రేజ్ లేని పరిస్థితులలో నాని సోదరి దీప్తి ఎలా సోనీ సంస్థను ఒప్పించింది అన్న ప్రశ్నకు నాని చాల వివరంగా సమాధానం ఇచ్చాడు. తన సోదరి పడుతున్న కష్టం తాను చూశానని ఆమె హార్డ్ వర్క్ సోనీ సంస్థకు కూడ బాగా నచ్చడంతో ఈ వెబ్ సిరీస్ ను సోనీ స్ట్రీమ్ చేస్తున్న విషయాన్ని తెలియచేసాడు.  అయితే అసలు వాస్తవం వేరు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఆంథాలజీ సిరీస్ కు నాని బ్రాడింగ్ బాగా ఉపయోగ పడుతుంది అని భావించిన సోనీ స్వయంగా నాని ఈ సిరీస్ ను ప్రమోట్ చేయడం వల్ల నాని సోదరికి ఈ అవకాశం వచ్చి ఉంటుంది అన్న ప్రచారం కూడ ఉంది..
మరింత సమాచారం తెలుసుకోండి: