ప్రముఖ బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో.. ప్రముఖ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక్కొక్క రకమైన అప్డేట్ విడుదలవుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో రవితేజ కూడా నటిస్తున్నారు. చిరంజీవికి సవతి సోదరుడిగా తెలంగాణకు చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే పలు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రవితేజకు సంబంధించి చిన్న టీజర్ ను కూడా విడుదల చేయగా పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు అని పూర్తిస్థాయిలో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటలు టీజర్, పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉండడం గమనార్హం. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరొకవైపు ఆయన పోటీ నటుడు బాలకృష్ణ కూడా వీరసింహారెడ్డి సినిమాతో జనవరి సంక్రాంతి పండుగ బరిలో పోటీగా నిలవబోతున్నాడు. అటు వీర సింహారెడ్డి సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.ఇలా  ఇద్దరు బడా హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేసరికి ఎవరిది పై చేయి అవుతుందనే ఆత్రుత కూడా మొదలైంది.

ఇప్పుడు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి పాత్రకు సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం గమనార్హం. ఈ సినిమాలో చిరంజీవి అండర్ కవర్ కాప్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదు కానీ ఇప్పుడు ఈ వార్త అయితే బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.  మరి ఈ సినిమాలో చిరంజీవి ఏ పాత్రలో నటించబోతున్నాడు అని తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: