తమిళ సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా తునివు అనే తమిళ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మంజు వారియర్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ని నిన్న అనగా జనవరి 11 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ ని జనవరి 11 వ తేదీనే తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు.

తెలుగు లో ఈ మూవీ ని తెగింపు పేరుతో విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి తెలుగు కు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ  మూవీ యూనిట్ విడుదల చేయగా ... వాటికి తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటివరకు ఒక రోజు బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఒక రోజులో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సినిమా మొదటి రోజు తమిళనాడులో 225 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు 2.18 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటకలో ఈ మూవీ మొదటి రోజు 4.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
కేరళ లో ఈ మూవీ మొదటి రోజు 1.42 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొదటి రోజు ఈ మూవీ 0.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఓవర్సీస్ లో ఈ మూవీ మొదటి రోజు 8.85 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 20.10 కోట్ల షేర్ ,  39.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: