టాలీవుడ్ లో హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి కూడా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తను నటిస్తున్న చిత్రాలు ఒక్కొక్కటిగా త్వరలోనే విడుదల కాబోతున్నాయి. తన కొత్త సినిమాలను కూడా వరుసగా అప్డేట్లను సైతం తెలియజేస్తూ ఉన్నారు. వచ్చే నెల ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం కథ అంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది.


ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా నాలుగు సినిమాల షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. ఈ చిత్రం పూర్తికాకముందే ఇప్పుడు తాజాగా మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హాను రాఘవపూడి  దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అలాగే ఈ సినిమా వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ చిత్రం పైన అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.ప్రభాస్ నటిస్తున్న ఒక్కోచిత్రం దాదాపుగా రూ .500 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తూ ఉన్నారు.  ప్రభాస్ కు రెస్టు లేకుండా సినిమా షూటింగులు చేస్తూ ఉండడంతో అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయని అభిమానుల సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు.. ముఖ్యంగా అభిమానుల కోసం ప్రభాస్ ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటారని చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రాలన్నీ కూడా ప్రభాస్ రేంజ్ ని ఎక్కడ వరకు తీసుకువెళ్తాయో చూడాలి మరి. ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: