కరోనా దెబ్బతో దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం అయిపోతు గడిచిన 40 ఏళ్ళల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో జీడిపి వృద్ధి రేటు మైనస్ స్థాయికి వెళ్ళిపోతోంది. అయితే దీనికి రివర్స్ లో భారత విదేశీమారక ద్రవ్య ఖజానాలో ఫారెక్స్ నిల్వలు ఈ కరోనా సమయంలో 127 కోట్ల డాలర్లు పెరిగి మొత్తం 50,684 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడం ఇప్పుడు ఆర్ధిక విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.


ప్రస్తుతం మనదేశం పారిశ్రామిక ప్రగతిలో ముందు స్థానంలో లేకపోయినా ఫారెక్స్ నిల్వలలో ప్రపంచంలో 5వ స్థానంలో చైనా జపాన్ స్విజర్లాండ్ రష్యాల తరువాత స్థానంలో భారత్ ఉండటమే కాకుండా గడిచిన మూడు నెలలలో 2,500 కోట్ల ఫారెక్స్ నిల్వలు మన ఖజానాలో చేరడంతో కరోనా సమస్యలు మనదేశ ఫారెక్స్ నిల్వల పారిట అదృష్టంగా మారింది అని ఆర్ధిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పతనం కావడం బంగారు దిగుమతులు క్షీణించడంతో మన కరెంట్ ఖాతాలో ఇలా భారీ  మిగులు ఏర్పడింది అని అంటున్నారు.


ప్రస్థుత ఈ పరిస్థితి వల్ల సామాన్యుడుకి పెద్దగా ప్రయోజనం లేకపోయినా మనదేశానికి సంబంధించిన స్వల్ప మధ్యకాలిక స్వల్ప రుణాల చెల్లింపు విషయంలో ఈ కరోనా సమయంలో కూడ ఎటువంటు సమస్యలు తలెత్తకపోవడంతో భారత్ ఆర్ధిక పరిస్థితి పై ప్రపంచ ఆర్ధిక సంస్థలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వాస్తవానికి చమురు ధరల పతనం కొనసాగుతున్నా దేశంలో పెట్రోల్ డీసిల్ ధరలు తగ్గకుండా రివర్స్ గేర్ లో పెరిగిపోతు సామాన్యుడి పై పెను భారంగా మారుతున్న విషయం తెలిసిందే.


అయితే ఈ పరిస్థితులలో ఎటువంటి సంబంధం లేకుండా మన ఫారెక్స్ నిల్వలు పెరిగిపోవడంతో మనదేశ ఆర్ధిక వ్యవస్థకు ఎటువంటి ప్రమాదం లేదు. అయితే దేశంలోని అనేక చిన్నతరహా మధ్యతరహా పరిశ్రమలు మటుకు ప్రస్తుత పరిస్థితులలో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ కనీసం తమ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థాయిలో కూడ లేవు అన్నది వాస్తవం. అయినా పెరిగిపోతున్న ఈ ఫారెక్స్ గలగల వల్ల సామాన్యుడుకి ఏమి ప్రయోజనం అన్న విషయమై తలలు పండిన ఆర్ధిక నిపుణులు దగ్గర కూడ సరైన సమాధానం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: