ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది తక్కువ జీతంతో బతకాలి అంటే చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. దీంతో ఎక్కువగా స్వయం ఉపాధి వంటివి ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చాలామంది ఏదైనా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టాలనే ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు. అలా చిన్న చిన్న వ్యాపారం చేయాలనుకున్న వారికి డబ్బుతో ముడిపడి ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో చాలామంది ఆస్తులను తాకట్టుపెట్టి మరి బిజినెస్ లు మొదలు పెడుతూ ఉంటారు. ఇది రిస్క్ తో కూడిన పని అయినప్పటికీ చేస్తూ ఉంటారు.. వడ్డీ రూపంలో కూడా అప్పు తీసుకుంటూ ఉంటారు.


అయితే ప్రధాన ముద్ర యోజన పథకం ద్వారా చిన్న మధ్య చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి ఈ పథకం ఉన్నది.. ఏప్రిల్ 8.. 2015 లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ఇలాంటి వాటిలో లోన్ తీసుకోవచ్చు. అన్ని అర్హతలు సరైన పత్రాలు ఉంటే కచ్చితంగా ఇందులో సుమారుగా తక్కువ వడ్డీతో రూ .10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. అయితే ఈ ముద్ర లోన్ కేవలం ప్రభుత్వ బ్యాంకులే కాకుండా గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఇతరత్రా ఫైనాన్షియల్ కంపెనీలు వంటివి కూడా ఆర్థిక సంస్థలు కూడా లోన్ అందిస్తాయట.

అయితే ఇందులో మూడు దశలలో రుణాలను సైతం అందిస్తారు.. మొదట శిశు రుణం ఇందులో 50 వేలకు లోను పొందవచ్చు.. ఆ వెంటనే కిషోర్ లోన్ కింద రూ.50 వేల నుంచి రూ .5 లక్షల వరకు పొందవచ్చు. ఆ తర్వాత తరుణ్ లోన్ కింద రూ.5 నుంచి రూ .10 లక్షల వరకు పొందవచ్చు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఆన్లైన్లో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే..www.mudra.org.in వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ ఈ లోన్ కోసం ఆధార్ కార్డ్ అడ్రస్ ఫోటో సంతకం బిజినెస్ కు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోన్ ని సైతం అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: