టాలీవుడ్ లో టాప్ హీరోలకు ఫ్యాన్స్ క్రేజ్ కలసి వస్తోంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇందుకు ఉదాహరణ రామ్ చరణ్ తేజ వినయ విధేయ రామ.. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు విపరీతంగా నెగిటివ్ గా వచ్చాయి. బోయపాటి దర్శకత్వంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. విపరీతమైన హీరోయిజం.. లాజిక్ లేని సీన్లు.. ఇలా సినిమా దారుణంగా ఉందంటూ ప్రచారం జరిగింది.


కానీ ఈ సినిమా మొదటి నాలుగైదు రోజులు బ్రహ్మాండంగానే వసూలు చేసింది. సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ కలెక్షన్లపై కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రభావం కనిపించింది. ఇప్పుడు సేమ్ సీన్ సాహో విషయంలోనూ కనిపిస్తోంది. వినయ విధేయ రామ లెవల్లో కాకపోయినా సాహోకు కూడా చాలా నెగిటివ్ గానే రివ్యూలు వచ్చాయి. తనకు వచ్చిన బ్రహ్మాండమైన అవకాశాన్ని దర్శకుడు సుజీత్ దుర్వినియోగం చేశాడని చాలా మంది విమర్శకులు కామెంట్ చేశారు.


ఇక వినయ విధేయ రామతో పోల్చుకుంటే.. సాహో.. పాన్ ఇండియా సినిమా.. బాహుబలితో వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చింది. అందుకే సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాహో సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకూ ఓవరాల్ గా 400 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించిందని చెబుతున్నారు. మామూలుగా సాహో కు వచ్చిన నెగిటివ్ టాక్ కూ ఈ కలెక్షన్లకూ సంబంధమే లేదు.


ఇది ఒక్క సాహో విషయంలోనే కాదు..టాలీవుడ్ లో ఇది చాలా కామన్ అయ్యింది.తొలి వారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోలుగా ప్రభాస్‌తోపాటు రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, చిరంజీవి, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఇప్పటికే రికార్డులు సృష్టించారు. ‘బాహుబలి’ చిత్రాలతో పాటు ‘ఖైదీ నంబర్‌ 150’, ‘మహర్షి’, ‘భరత్‌ అనే నేను’, ‘అరవింద సమేత’, ‘జై లవకుశ’, ‘రంగస్థలం’, ‘వినయ విధేయ రామ’, ‘డీజే’ చిత్రాలు రికార్డు స్థాయిలో షేర్‌ వసూళ్లు సాధించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: