కాజల్ అగర్వాల్ చేతిలో ఇపుడు సినిమాలు పెద్దగా లేవు. బోల్డ్ సీతగా నటించిన
సినిమా బోల్తా కొట్టిన తరువాత
కాజల్ కొంత వెనకబడింది. మరో వైపు కొత్త హీరోయిన్లు వెల్లువలా వచ్చేస్తున్నారు. ఇక టాప్ స్టార్స్, యంగ్ స్టార్స్ వారికే ఆఫర్లు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో
కాజల్ పెళ్ళి చేసుకుంటుందని కూడా ప్రచారం ఓ వైపు సాగుతోంది.
అయితే
కాజల్ కి ఇపుడు మెగా క్యాంప్ నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు.
కాజల్ ని
కొరటాల శివ,
మెగాస్టార్ కొత్త మూవీలో
హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారుట. ఈ ముదురు
భామ అయీతే
మెగాస్టార్ పక్కన చక్కగా సరిపోతుందని డైరెక్టర్
కొరటాల ఒక అంచనాకు వచ్చారట. నిజానికి
కాజల్ కంటే ముందు ఈ సినిమాకు
త్రిష పేరు కూడా వచ్చింది. అయితే
త్రిష అవుట్ డేటెడ్ అయిందని, ఆమెను పెట్టుకుంటే కుర్రకారు అసలు అట్రాక్ట్ కారని భావించి ఆ ఆలోచన మానుకున్నట్లుగా చెబుతున్నారు.
మరి సీనియర్
హీరో చిరంజీవి పక్కన ఎవరు అన్నది పెద్ద చర్చ, అతి పెద్ద సెర్చింగ్ అయిందిట. ఎందుకంటే
మెగాస్టార్ తో నటించే హీరోయినులు లేరిపుడు. నయనతారతో
సైరా చేసేశారు. మళ్ళీ ఆమె విషయం ఎందుకో ప్రస్తావించడంలేదు,
అనుష్క తీసుకుంటే వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయని అంటున్నారు. దీంతో
చిరంజీవి సినిమాకు
హీరోయిన్ కొరత ఏర్పడింది. దాంతో
ఖైదీ నంబర్ 150 హీరోయిన్నే రిపీట్ చేయాలని చివరికి నిర్ణయం తీసుకున్నట్లుగా భోగట్టా. అదే జరిగితే
మెగాస్టార్ తో మరో మారు జత కడుతున్న గోల్డెన్ చాన్స్
కాజల్ కి వచ్చినట్లే. అసలే సరైన అవకాశాలు లేని
కాజల్ కి ఈ విధంగా పంట పండినట్లే అనుకోవాలి. సో లక్కీ
కాజల్ అగర్వాల్ కి ఆల్ ది బెస్ట్.