అభిమాన హీరోల పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్‌కు పెద్ద పండుగే.  ఆ రోజున అన్నదానాలు, రక్త దానాలు, వృద్దాశ్రామాల్లో పండ్లు, చిన్న పిల్లలకు పుస్తకాలులాంటి సేవా కార్యక్రమాలను చేస్తే ఎవ్వరికీ ఏ గోల ఉండదు. కానీ తమ ప్రాణ సమేతంగా చూసుకునే హీరోల కోసం తమ ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు, వాటిని ఎంకరేజ్ చేయడం లాంటివి చేస్తూనే చిక్కొస్తుంది. తాజాగా అలాంటి ఓ ఘటనపైనే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

 

 

    అక్కినేని  నాగచైతన్య బర్త్ డే రోజున సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఫ్యాన్స్ నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి బర్త్ డే విషెస్ అందాయి. దీంతో సోషల్ మీడియాలో చైతు బర్త్‌డే ట్రెండింగ్‌లోకి కూడా వచ్చేసింది. అక్కినేని అభిమానులైతే  చైతు పుట్టిన రోజును అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్ని ఏరియాల్లో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ చైతును బర్త్‌డే గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. నాగచైతన్యకు చెందిన ఓ ఫ్యాన్ మాత్రం చాలా పెద్ద సాహసం చేశాడు. చైతూ పుట్టిన రోజు సందర్బంగా సింహాచలం గుడికి వెళ్లాడు అభిమాని. కేవలం అదే అయితే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకునే వాళ్ల కాదు. అతడు మోకాళ్లతో సింహాచంల గుడి మెట్లు ఎక్కి దేవుడిని దర్శించుకున్నాడు. అతడి పేరు సాగర్.. అతడిది బొబ్బిలి. మోకాళ్లతో సింహాచలం మెట్లు ఎక్కిన అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 

     తన భర్త కోసం అంత సాహసం చేసిన ఆ అభిమాని ప్రేమను చూసిన సమంత పొంగిపోయింది. ఆ వీడియోను సమంత షేర్ చేసింది. థ్యాంక్ యూ.. ఇదో గొప్ప విషయం.. మాటలు రావడం లేదు తప్పకుండా మీరు మమ్ముల్ని కలవండి అంటూ రీ ట్వీట్ చేసింది. ఇక దీంతో సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. ఆమె రీ ట్వీట్‌పై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అభిమానులు అలా చేస్తుంటే వద్దంటూ వారించడం పోయి వారిని ప్రోత్సహించడం ఏంటని విమర్శిస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల మిమ్ములను కలవచ్చు అని మరికొందరు ఇలా ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఎవరిది రెస్పాన్సుబులిటీ అంటూ సమంతను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ అభిమాని ప్రేమను, కష్టాన్ని గుర్తించిన సమంత గ్రేట్ అంటూ మరోవైపు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: