టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. విజయ్ చేసిన సినిమాలు ఏమో గాని అతను చేసిన వ్యాఖ్యలకే అతనికి ఎక్కువగా ఫాలోయింగ్ వస్తుంది అనేది అందరికి అర్ధమవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో బాబు నటనకు టాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు. అక్కడి నుంచి ఏ సినిమా వచ్చినా సరే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు బాబు కొన్ని హాట్ కామెంట్స్ చేయడంతో పాటుగా యూత్ లోకి ఎక్కువగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. 

 

సోషల్ మీడియాలో కూడా అతను ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాడు. అతను ఏ పోస్ట్ పెట్టినా సరే జనానికి ఏదో సరికొత్త ఉత్సాహం కింద ఉంటుంది అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే అతనికి ఇబ్బందిగా మారింది. అతను టాలీవుడ్ లో చాలా మంది పెద్దలకు వ్యతిరేకి అయ్యాడని అంటున్నారు. చాలా మంది ఎవరో ఒకరిని పొగిడి పైకి రావాలని చూస్తూ ఉన్నారు. కాని బాబు మాత్రం కాస్త భిన్నంగా ప్రయత్నాలు చేసాడు. తాను ఎవరికి లొంగను అన్నట్టు యూత్ లో క్రేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఇబ్బందికరంగా మారింది అనేది కొందరు మాట్లాడే మాట. 

 

ఈ మధ్య అతను విడుదల చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను కొందరు టార్గెట్ చేసారు. రివ్యు లు వ్యతిరేకంగా రాయించారు. అది ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. కాని విజయ్ కెరీర్ ని మాత్రం చాలా మంది టార్గెట్ చేసారు అనేది జనాల మాట. అతను మాట్లాడే మాటలు అతను సినిమా కోసం చేసే హడావుడి చాలా మందికి నచ్చడం లేదని అంటున్నారు. ఈ మధ్య అతను అతి ఎక్కువగా చేస్తున్నాడని కొందరు టాలీవుడ్ పెద్దలు కూడా అంటున్నట్టు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: