ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భయంతో వణికి పోతున్నారు.  ఎక్కడ చూసినా కరోనా వైరస్ కి సంబంధించిన వార్తలే వస్తున్నాయి.  అయితే కరోనాకు సంబంధించిన ప్రతి వార్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  మరికొంత మంది కరోనాపై తమకు ఇష్టమొచ్చినట్లుగా వార్తలు రాస్తున్నారు.  కరోనా వైరస్ ను ఇలా కూడా నివారించవచ్చంటూ జరుగుతున్న కొన్ని ప్రచారాలపై సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూ ఘాటుగా స్పందించారు. గోమూత్రం ప్రతి వ్యాధిని నయం చేస్తుందని చెత్త ప్రచారం చేస్తున్నారని, తద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

 

 'మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు. గుడ్డివాళ్లూ ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్నీ రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపుతారా?' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కాగా, కోవిడ్‌ను నివారించే శక్తి కేవలం గో మూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అఖిల హిందూ మహాసభ అధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే  రోజురోజుకు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతుంది.. సుమారు 147 దేశాలకు ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

 

ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. భారత దేశంలో ఇప్పుడు కరోనా గురించి అన్ని రాష్ట్రల్లో కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్స్, మాల్స్, బార్లు, క్లబ్బులు, థియేటర్లు అన్నీ మూసి వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: