దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ప్రపంచ దేశాలు కూడా దీనికి భయపడిపోతున్నాయి. లక్షల మంది ప్రజలకు ఈ వైరస్ సోకడం తో ఇప్పుడు జనాలు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. సోషల్ మీడియా లో ప్రచారం కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా షట్ డౌన్ ని ప్రకటించాయి కూడా. ప్రస్తుతం తెలంగాణా లో అయితే పెళ్ళిళ్ళు కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా దెబ్బకు సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. పదుల సంఖ్యలో సినిమా షూటింగ్ లు వాయిదా వేస్తున్నారు దర్శక నిర్మాతలు. అగ్ర హీరోల సినిమా లు అయితే విదేశాల్లో షూటింగ్ ఉన్నా సరే రద్దు చేసేస్తున్నారు. దీనితో ప్రస్తుతం సినిమాల షూటింగ్ లు అన్నీ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు కరోనా దెబ్బకు చాలా మంది హీరోయిన్ లు షూటింగ్ కి రావడం లేదు. కొంత మంది హీరోయిన్ లు ఆఫర్లు లేకపోయినా పర్వాలేదు తాము మాత్రం షూటింగ్ కి వచ్చేది లేదని చెప్తున్నారు. 

 

కొంత మంది హీరోయిన్లు అయితే తమ ఇళ్ళను దాటి బయటకు రావడం లేదు. ఏ హీరో సినిమా అయినా సరే తాము మాత్రం వచ్చేది లేదని చెప్తున్నారు. దీనితో దర్శకులు కూడా ఒత్తిడి చేయలేకపోతున్నారు. వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో సినీ పరిశ్రమ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కడా కూడా సినిమాల షూటింగ్ ని జరగనీయకుండా చూడాలని భావిస్తున్నారు. ఏదైనా తేడా వస్తే... ఇబ్బంది అవుతుందని కాబట్టి దూరంగా ఉంటే మంచిది అంటూ సినీ పెద్దలు కూడా చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: