హాలీవుడ్ మోడల్ క్రిస్సీ టీజెన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. ఇటీవల తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తీసేయించుకోవాలనుకుంటున్నా అంటూ పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన క్రిస్సీ తాజా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పదవ యానివర్సీ అంటూ ట్వీట్ చేసింది క్రిస్సీ.
తన ఇంప్లాంట్స్ కనిపించేలా ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో దిగిన కొన్ని థ్రో బ్యాక్ ఫోటోలను పోస్ట్ చేసిన క్రిస్సీ `ఈ ఇంప్లాంట్స్‌తో ఆనందంగా 10 ఏళ్లు గడిచాయి. త్వరలోనే వీటిని తొలగించుకుంటా` అంటూ కామెంట్ చేసింది. ఇప్పటికే వాటిని తొలగించుకునేందుకు అన్ని ఎరేంజ్మెంట్స్ చేసుకున్న క్రిస్సీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకుంది.
క్రిస్సీ 20 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే అప్పట్లో ఆమె లుక్ విషయంలో విమర్శలు రావటంతో బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకుంది. అయితే అప్పట్లో ఆమె నిర్ణయంపై విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు తన భారీ అందాలతో ఆమె పిల్లలతో కలిసి దిగిన ఫోటోలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
View this post on Instagramhappy 10 year anniversary to these titties and RIP to these teeth. 💕 @christopher.peterson