టాలీవుడ్ జనాలు ఎక్కువగా ఎదురు చూసే పెళ్లి రానాది. ప్రభాస్ ది. వీరి పెళ్లి కోసం జనాలు ప్రత్యేక దృష్టి పెట్టి మరీ ఎదురు చూస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రానా పెళ్లి విషయంలో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ తనకు నచ్చిన సమయంలో గ్యాప్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ బిజీ అవుతున్నాడు. ఇప్పుడు మూడు సినిమాల్లో రానా నటిస్తున్నాడు. అటు బాలీవుడ్ జనాలకు కూడా రానా మంచి స్నేహితుడు కావడం తో అతని పెళ్లి కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. 

 

రానా విషయంలో కాస్త సోషల్ మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ జనాలకు రానా సుపరిచితుడు కావడం తో ఎప్పటికప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. ఆయన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ బిపాసా బసు ని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఆ తర్వాత త్రిష పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. రానా విషయంలో కొందరు ప్రచారాలను బాగానే చేస్తున్నా సరే రానా మాత్రం పెళ్లి విషయం లో ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు అతను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. 

 

పెళ్లి చేసుకుని తర్వాత సినిమాలను చెయ్యాలని భావిస్తున్నాడు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని చిన్న నాటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సమాచారం. రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలుస్తుంది. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడని ఆమె ఫ్యాషన్ కోర్స్ ఏదో చేసింది చెన్నై లో అక్కడ రానా తో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వీరి వివాహం త్వరలోనే చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: