పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు ఎంత ఆటిట్యూడ్ తో ఉంటారో తెలిసిందే. మొత్తం ఇండియాలోనే హీరో క్యారెక్టరైజేష మీద కథ రాసే ఒకే ఒక్కడు పూరి జగన్నాథ్. సాధారణంగా వాడే తిట్లని కూడా సినిమా పేర్లుగా పెట్టిన ఒకే ఒక్కడు పూరి జగన్నాథ్. అయితే సినిమా పేర్లే కాదు, పూరి సినిమాల్లోనూ బోల్డ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా చూస్తుంటే పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోల చేత అలాంటి పదాలని పలికిస్తున్నాడు.

 


ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత పూరి చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. హీరోల చేత బోల్డ్ డైలాగులు మాట్లాడించే అలవాటున్న పూరి ఈ సినిమాలో విజయ్ చేత అలాంటి మాటలని మని వినిపించనున్నాడట.

 

మొన్నటికి మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఇలాంటి డైలాగులు పలికిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఫైటర్ లోనూ అలాంటి డైలాగులు ఎక్కువగా ఉంటాయట. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ కి విపరీతమైన స్పందన వచ్చింది. వాటి వల్లే యూత్ అట్రాక్ట్ అయ్యారని చెబుతుంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ చిత్రంలో వాటి డోస్ మరింత పెరగనుందని అంటున్నారు. 

 

పూరి జగన్నాథ్ సినిమాల్లో ఇలాంటివి కామనే అయినప్పటికీ, విజయ్ దేవరకొండ వంటి హీరో పలకడం యూత్ ని మరింత అట్రాక్ట్ చేస్తుందని అనుకుంటున్నారట. అయితే ఎన్ని డైలాగులున్నా సినిమా బాగుంటేనే హిట్ అవుతుందన్న విషయం మర్చిపోకూడదు. అర్జున్ రెడ్డి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు జనాలకి కనెక్ట్ కావడం వల్లే ఆ సినిమాలోని మాటల గురించి బయటకి వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: