మజిలీ, వెంకీ మామా చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య తన తర్వాతి చిత్రంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణాలు, ఒకటి దర్శకుడు శేఖర్ కమ్ముల కావడం. రెండు, శేఖర్ కమ్ముల మళ్లీ ప్రేమ కథాంశాన్ని తెరకెక్కించడం.

 

 

సెన్సిబుల్ ప్రేమ కథల్ని అందంగా తెర మీద ఆవిష్కరించే శేఖర్ కమ్ముల తనదైన మ్యాజిక్ తో మాయ చేస్తుంటాడు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా చిత్రాలతో అందరికీ సరికొత్త అనుభూతిని పంచాడు. అందుకే ఈ సినిమాతోనూ మరో మంచి మనసుకి హత్తుకునే సినిమా తీస్తాడనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన కుర్రాడిగా కనిపించనున్నాడట.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LOVE STORY' target='_blank' title='love story-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>love story</a> new release date confirmed - tollywood

 

అందుకోసం తెలంగాణ గ్రామీణ ప్రాంత యాసని కూడా నేర్చుకున్నాడట. లవ్ స్టోరీ చిత్రంలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ చూడబోతున్నామని అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజ్ చేసిన నాగచైతన్య లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో చైతన్య మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అనుకుంటున్నారు. అయితే మొన్నటి వరకూ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని భావించారు. 

New lyrical video from IHG - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SAI PALLAVI' target='_blank' title='sai pallavi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sai pallavi</a> 's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LOVE STORY' target='_blank' title='love story-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>love story</a> out-  <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='cinema-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cinema</a> express

కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాని ఈ చిత్రం డైరెక్టుగా థియేటర్లలోనే విడుదల అవనుందట. కరోనా కారణంగా ప్రస్తుతం రిస్కు తీసుకోవడం అనవసరమని భావించిన చిత్రబృందం నవంబరులో షూటింగ్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యారట. అంటే నవంబరులో షూటింగ్ స్టార్ట్ అయితే డిసెంబరులో కంప్లీట్ చేసుకున్నా రిలీజ్ అయ్యేది వచ్చే ఏడాదిలోనే అని అర్థం అవుతుంది. మొత్తానికి చైతన్య ఈ సంవత్సరం తెర మీద కనిపించడన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: