టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్. బాబు సినిమా వస్తుంది అంటే చాలు ఫాన్స్ కి ఒక రేంజ్ లో పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్స్ విషయంలో ఆయన శ్రద్ద తీసుకోరు అనే పేరు కూడా ఆయనకు ఉంది. తనకు ఎంత క్రేజ్ ఉన్నా సరే డాన్స్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉండదు అని కేవలం తన హిట్ తో అతను మ్యానేజ్ చేస్తాడు అని మొదటి సినిమా నుంచి కూడా అతనికి పేరు ఉంది. అయితే మిర్చీ సినిమా బిల్లా సినిమాలో మాత్రం కాస్త డాన్స్ తో అతను ఆకట్టుకున్నాడు.  అదే విధంగా బుజ్జిగాడు సినిమాలో కూడా అయన డాన్స్ ఆకట్టుకుంది. 

 

మున్నా సినిమాలో అలాగే... రెండు  మూడు సినిమాల్లో డాన్స్ విషయంలో ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు అనే చెప్పాలి. ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఆయనకు మంచి పేరు వచ్చింది గాని పూర్తి స్థాయిలో ప్రభాస్ మంచి డాన్సర్ అని చాలా మంది అనలేదు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా లో  కూడా డాన్స్ కి అంతగా ప్రాధాన్యత ఉండదు అని అంటున్నారు. బాహుబలి సినిమాలో డాన్స్  ఎలాగూ ఉండదు కాబట్టి ఆ సినిమాలో ఆయన డాన్స్ గురించి పెద్దగా ఎవరో కూడా అంతగా ఆసక్తి చూపించలేదు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఒక్క సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం కథ లో మార్పులు చేస్తున్నారు అని టాక్. ఇక ఈ సినిమాపై ప్రభాస్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: