బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆట రసవత్తరంగానే సాగుతోంది. అయితే ఎలిమినేషన్ దగ్గరే తేడా వస్తోంది అంటున్నారు. ఆడియన్స్ ఫలనా వారు కచ్చితంగా వెళ్లిపోతారు అని అంటూంటే  అక్కడ మాత్రం వారు కులాసాగా ఉంటున్నారు. వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇపుడు 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే అక్కడ  మిగిలారు. ఆరవ వారం నడుస్తోంది. ఇవాళా రేపూ నాగార్జున హోస్ట్ గా వచ్చి వీకెండ్ షోను రక్తి కట్టిస్తారు. దాంతో పాటే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అవుతాడు. ఆ కంటెస్టెంట్ ఎవరా అన్నదే టెన్షన్ పెట్టే న్యూస్.

బిగ్ బాస్ లో తొమ్మిది మంది ఈసారి నామినేషన్లలో ఉన్నారు. వీరిలో అభిజిత్, నోయల్, లాస్య, వంటి వారు చాలా సేఫ్ గా ఉన్నారు. అలాగే దివి కొంచెం అటు ఇటుగా ఉందని అంటున్నారు. డేంజర్ జోన్ లోకి వచ్చిన వారిలో ఆ ఇద్దరి మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఈ వారం మోనాల్ గజ్జర్ ఇంటికి వెళ్ళిపోతుందని అంటున్నారు. ఆమె గత రెండు వారాల్లోనే నిజానికి వెళ్ళాలి. కానీ మధ్యలో వేరే ఎవరో వచ్చి ఆదుకున్నారు, అడ్డుకున్నారు.

ఈసారి మాత్రం మోనాల్ ఎలిమినేషన్ తప్పదని అంటున్నారు. ఆమెతో ట్రయాంగిల్ లవ్ మసాలా కూడా పండడంలేదు. అటు అఖిల్ అలకలు పూనాడు, ఇటు అభిజిత్ ఒంటరిగా ఉంటున్నాడు. మోనాల్ చూస్తే ఆటల్లోనూ, టాస్క్ లోనూ కూడా ఎక్కడా రాణించడంలేదు అంటున్నారు. బిగ్ బాస్ ఎంత చెప్పినా ఆమె తెలుగులో మాట్లాడలేకపోతోంది. ఇది ఆమెకు మైనస్ గా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ వారం ఆమె బయటకు వస్తుందని అంటున్నారు.

ఆమెతో పాటు కుమార్ సాయి కూడా బిగ్ బాస్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడని అంటున్నాడు. అతను కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఆటలు, టాస్కులలో ఇపుడిపుడే పాలుపంచుకుంటున్నా ఎక్కువగా హౌజ్ మేట్లతో ఆయన కలవలేకపోతున్నాడు అన్నదే మైనస్ గా ఉంది. అతను తన టాలెంట్ అన్నది ప్రూవ్ చేసుకునే అవకాశాలు వచ్చినా ఎక్కడా చూపించడంలేదని అంటున్నారు అందువల్ల ఈ ఇద్దరి మీదనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోందిట. మరి చూడాలి ఎవరు బయటకు వెళ్తారో.
 




మరింత సమాచారం తెలుసుకోండి: