బుల్లితెర మీద సుధీర్ రష్మిలది సూపర్ హిట్ జోడీ.. యూట్యూబ్ లో వీరిద్దరి మీద కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇద్దరు కలిసి ఏ షో చేసినా సూపర్ సక్సెస్ అవుతుంది. ఏడేళ్లుగా రష్మిని వెంట పడుతుండటం వల్లే తన వల్ల ఈ క్రేజ్ వచ్చిందని అంటాడు సుధీర్. అయితే రష్మి కూడా సుధీర్ తో చేసే ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను ఎంజాయ్ చేస్తుంది. మేమిద్దరం మంచి స్నేహితులమే.. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అలా కనిపిస్తాం అంటారు ఈ ఇద్దరు.

స్మాల్ స్క్రీన్ పై వీళ్ళని కొట్టే జోడీ మరోటి రాలేదని చెప్పొచ్చు. అయితే ఈమధ్యలో హైపర్ ఆది, వర్షిణిలు ఫేం లోకి వచ్చారు. ఢీ చాంపియన్స్ లో ఆది, వర్షిణిల పులిహోర కార్యక్రమం బాగానే వర్క్ అవుట్ అవుతుంది. అందుకే ఈమధ్య ఆది ఎక్కడ కనబడితే వర్షిణి అక్కడ కనబడుతుంది. అయితే వీళ్లు కూడా సుధీర్, రష్మిలలా ఆన్ స్క్రీన్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. వీరెంత్ర ట్రై చేసినా సరే వాళ్లలా క్రేజ్ తెచ్చుకోవడం కష్టమని చెప్పొచ్చు.

టివి ఆన్ చేస్తే కనబడే ఈ జోడీలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం అసలు తగ్గట్లేదు. ఇక ఈమధ్య సోలోగా ఉన్న ప్రదీప్, శ్రీముఖిలను జోడీగా చేసి కొత్త షో స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బుల్లితెర మీద జోడీలతో స్మాల్ స్క్రీన్ అంతా కలర్ ఫుల్ గా చేస్తున్నారు.                                                                                   
     

మరింత సమాచారం తెలుసుకోండి: