కరోనా వల్ల ఏడు నెలలు థియేటర్లు బంద్ అవడంతో వరుసగా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దసరాకి రిలీజ్ అవుతాయని అనుకొగా అది కుదరలేదు. దీపావళికి కూడా కష్టమే అని అనిపిస్తుంది. ఇక దాదాపు 2021 సంక్రాంతికి సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. చూస్తుంటే సంక్రాంతికి వరుస క్రేజీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 3 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ ఎనౌన్స్ చేశాయి.

అందులో మొదటిది అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. అఖిల్, పూజా హెగ్దే లీడ్ రోల్స్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా రామ్ రెడ్ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంటుందని తెలుస్తుంది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో రామ్ హీరోగా వస్తున్న ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాను పొంగల్ రేసులో ఉంచుతున్నారు.

ఇక ఈ సినిమాలతో పాటుగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న క్రాక్ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంతే దాదాపు ఈ ఇయర్ సినిమాల పండుగ ఉండే ఛాన్స్ లేదని అనిపిస్తుంది. 2021 సంక్రాంతి నుండి వరుస సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో సంక్రాంతికి యువ హీరోల పోటీ రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు.                                                                                  
 

మరింత సమాచారం తెలుసుకోండి: