న్యాచురల్ స్టార్ నాని సినిమా కి నిర్మాతల కష్టం ఇప్పట్లో వదిలేలా లేదు..ఇప్పటికే వి సినిమా తో భారీ ఫ్లాప్ ని ఎదుర్కున్న నాని కి ఈ టైపు కష్టలు కొంత టెన్షన్ పెట్టేవే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న నాని గత సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న ఈ సినిమా మరో క్లాసిక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..యూనిట్ లోని ఒకరికి కరోనా సోకడంతో  ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి వాయిదా వేశారు.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట.

దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమా తోనే నాని శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు..విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. దాంతో ఈ సినిమా ని నాని వేరే నిర్మాత కు అప్పగించాడు..అయితే ఆ నిర్మాత కూడా ఈ సినిమానుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.. ఈ చిత్రం పట్ల ఓ అగ్ర నిర్మాత ఆసక్తిగా వున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సదరు నిర్మాతకు నానితో మంచి రిలేషన్ వుండడంతో పాటు బడ్జెట్ ఎక్కువ అవుతుందనే టాక్ వుండడంతో తానయితే బెస్ట్ ఆప్షన్ అవుతానన్నట్టుగా నానికి సంకేతాలు పంపించినట్టు భోగట్టా. ఈ రూమర్లలో వాస్తవం ఎంత అనేది తెలియదు. అయితే ఇంతవరకు ఈ చిత్రాన్ని కాన్సిల్ చేసుకున్నట్టు నాగ వంశీ నుంచి కానీ, ఈ చిత్రం మరో నిర్మాత చేస్తున్నాడనే న్యూస్ నాని తరఫునుంచి కానీ అధికారికంగా బయటకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: