ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు స్టార్ క్రేజ్ తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. నాని వి సినిమాలో కథ పరంగా నాని నెగటివ్ రోల్ చేయగా అందులో హీరో అంటే సుధీర్ బాబు అనే చెప్పాలి. నాచురల్ స్టార్ నాని కన్నా వి సినిమాలో సుధీర్ బాబు నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సినిమాలో తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్న సుధీర్ బాబు సరైన సినిమా పడితే తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇప్పుడు అలాంటి సరైన సినిమా ఒకటి చేతికి వచ్చింది. సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాని పలాస ఫేం కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు నటిస్తున్నారు. సూరి బాబు లైటింగ్ పెడితే అదిరిపోవాల్సిందే అనేలా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఉంది. చేతిలో సోడా బుడ్డి కూడా సినిమా మాస్ ఆడియెన్స్ కు పండుగ అనిపించేలా చేస్తుంది.

కెరియర్ లో ఇప్పటివరకు తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్న సుధీర్ బాబు ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు పడుతుననయి. పలాస తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ సుధీర్ బాబుతో చేస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ ఎలా ఉంటుందో చూడాలి. తప్పకుండా ఈ సినిమా కొత్తగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. పలాస లానే ఈ సినిమాను కూడా పిరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు కరుణ కుమార్. ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఫుల్ కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.    

             




 

మరింత సమాచారం తెలుసుకోండి: