సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇంటినిండా చుట్టాలు, ఊరి నిండా సినిమాలు, విందులూ, వినోదాలకు అసలు లోటు ఉండదు, అలాంటి సంక్రాంతి పండుగా టాలీవుడ్ కి అతి పెద్ద సీజన్ కూడా ఫ్లాప్ అవాల్సిన సినిమాలు ఏవరేజ్ అయితే, ఏవరేజ్ సినిమాలు హిట్ అవుతాయి. దాంతో సంక్రాంతికి తమ సినిమా ఎలాగైనా ఉండేలా సినీజనం చూసుకుంటారు.

అలా 2020లో రెండు సినిమాలు పోటాపోటీగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీతో టాప్ రేంజి హిట్ కొడితే అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో మూవీతో అదిరిపోయే హిట్ కొట్టారు. ఆ తరువాత మాత్రం సినీ పరిశ్రమకు సంక్రాంతి కళ లేకుండా పోయింది. కరోనా వైరస్ కారణంగా అన్ని సీజన్లు లేకుండా కాకుండా పోయాయి.

ఉగాది, వినాయకచవితి, దసరా, దీపావళి, నాగులచవితి, క్రిస్మస్ సీజన్లలో మూవీస్ రిలీజ్ లేకుండా పోయింది. కరోనా భయంలో జనం థియేటర్లకు రావడం మానుకున్నారు. అదే సమయంలో సినిమాల రిలీజ్ కి కూడా నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే 2021 సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అని టాలీవుడ్ ఇన్నాళ్ళూ నిబ్బరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇపుడు ఆ ధీమా కూడా సడలుతోందిట. రాం రెడ్ మూవీ ఓటీటీకే అని అంటున్నారు. అదే వరసలో మరిన్ని సినిమాలు కూడా సంక్రాత్రి వేళ ఓటీటీనే నమ్ముకుంటాయట.

దానికి కారణం కరోనా సెకండ్ వేవ్ అన్న ప్రచారం, అంతే కాదు, థియేటర్లలో ఆక్యుపెన్సీ రేట్ కూడా దారుణంగా ఉంటుందన్న అంచనాలు. దీంతో ఈ సంక్రాతిని అక్కినేని హీరో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచలర్ మూవీతో పాటు ఒకటో రెండో సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజ అవుతాయి అని అంటున్నారు. సో. సంక్రాంతి ఈసారి చప్పగా ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: