బిగ్ బాస్ సీజన్ 4 12వ వారం నామినేషన్స్ లో నలుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. మోనాల్, అవినాష్, అరియానా, అఖిల్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో అవినాష్ కు ఎలాగు ఎవిక్షన్ కార్డ్ ఉంది కాబట్టి అతను వాడుకునే ఛాన్స్ ఉంది. ఎటొచ్చి మోనాల్, అఖిల్, అరియానాలలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇక 12వ వారమే ఈ నామినేషన్స్ ఇలా ఉంటే ఇక 13వ వారం మరింత టఫ్ గా ఉండే ఛాన్స్ ఉంది.

ఒకవేళ ఈ వారం మోనాల్ వెళ్లిపోయి అఖిల్, అరియాన్నా, అవినాష్ ఉంటే వచ్చే వారం మిగిలిన ఆరుగురిలో కెప్టెన్ కాకుండా మిగిలిన ఐదురిలో నలుగురు నామినేట్ అవుతారు. అలా చూసినా ఇక మిగిలిన వారంతా సూపర్ స్ట్రాంగ్ కంటెస్టంట్స్ కాబట్టి ఎవరు వెళ్లినా షాక్ అయినట్టే. అభిజిత్, సోహెల్ కొద్దిగా సేఫ్ సైడ్ ఉన్నారు. వారు నామినేట్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అరియానా కెప్టెన్ అయితే మాత్రం వచ్చే వారం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అవినాష్ కెప్టెన్ అయినా కూడా సేం సీన్ రిపీట్ అవుతుంది.

అలా కాకుండా వచ్చే వారం కూడా హారిక, అవినాష్, అరియానా నామినేషన్స్ లో ఉంటే కచ్చితంగా ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా చూస్తే హారిక, అరియానా స్ట్రాంగ్ గా అనిపిస్తుండగా అవినాష్ ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. ఏది ఏమైనా 13వ వారం టాప్ 5 కంటెస్టంట్స్ ను డిసైడ్ చేసే ఓటింగ్స్ జరుగుతాయని అర్ధమవుతుంది.                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: