మెగా ఫ్యామిలీ వారి కోడలు ఉపాసన.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ..కొన్ని సామాజిక కార్యక్రమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "యువర్ లైఫ్''.ఈ కార్యక్రమం కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన గెస్ట్ ఎడిటర్‌గా ఉంటూ పలు రకాల పోషకాహార వంటలను పరిచయం చేస్తున్నారు. 'తాజాగా 'చికెన్ పుట్టు కర్రీ' వండి ఉపాసనకు రష్మిక రుచి చూపించారు. రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన..నటిగానే కాకుండా చెఫ్‌గా కూడా రష్మిక రాణిస్తుందంటూ కితాబిచ్చారు.ఇదిలా ఉంటే ఈ వీడియోలో రష్మిక మందన తన సామాజిక వర్గం గురించి ప్రస్తావించారు. తాను కోర్గి (కొడవ) సామాజిక వర్గానికి చెందిన అమ్మాయినని రష్మిక చెప్పారు.ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. కోడిని కోర్గ్ భాషలో కోలి అని అంటారట.

 రష్మిక వండిన వంటకం పేరు కూడా 'కోలీ పుట్టు' కూర. కోడిని కోర్గిలో కోలి అంటారని రష్మిక అనగానే.. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? మీరు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా? అని అడిగారు.దీనికి రష్మిక స్పందిస్తూ.. ''అవును, పంది మాంసం మా సంప్రదాయ వంటకం. పందిని అలానే నిప్పులపై కాల్చి తింటాం. నిజానికి పంది మాంసం, వైన్‌తో మేం చాలా చేస్తాం. మేం ఇంట్లోనే వైన్ తయారు చేస్తాం.ప్రతి కోర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు కప్పులు లేదా రెండు పెగ్‌ల వైన్ తాగుతారు. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే, గుండెకు కూడా చాలా మంచిది'' అని చెప్పారు.ఇందులో భాగంగానే రష్మీకతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పంది మాంసాన్ని తమ సాంప్రదాయ వంటకంగా భావిస్తూ.. ఎంతో ఇష్టంగా తింటారట..

ఇక రష్మీక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రష్మీక చిత్తూరు కి చెందిన ఓ పల్లెటూరి పిల్లగా కనిపించనుంది. దానికోసం చిత్తూరు యాసను కూడా స్వయంగా నేర్చుకుంటుంది ఈ అమ్మడు.ఆఅంతేకాదు తెలుగులో ఇప్పటివరకు పలు హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ ని దక్కించుకున్న రష్మీక.. ఇప్పుడు త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: