స్టార్ కమెడియన్ సునీల్ సినిమాలో ఉంటే ఆ సినిమాలో కామెడీకి ఎలాంటి డోకా ఉండదు. దశాబ్ధ కాలానికి పైగా కామెడీతో అలరిస్తూ వచ్చిన సునీల్ ఈమధ్యలో హీరోగా మారాడు. అందాల రాముడు సినిమాతో హిట్ అందుకున్నా సరే ఆ తర్వాత హీరోగా నిలబడటంలో వెనకపడ్డాడు. అయితే మళ్లీ తనకు సూపర్ క్రేజ్ తెచ్చిన కామెడీ రోల్స్ చేయాలని అనుకున్నా సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్తగా విలన్ గా ప్రయత్నిస్తున్నాడు సునీల్. ఆల్రెడీ రవితేజ డిస్కో రాజా సినిమాలో విలన్ గా సర్ ప్రైజ్ చేసిన సునీల్ ఆ తర్వాత కలర్ ఫోటోలో ఫుల్ టైం విలన్ గా చేసి మెప్పించాడు.

ఆ సినిమాలో సునీల్ విలనిజం బాగా మెప్పించింది. కలర్ ఫోటో రిజల్ట్ సునీల్ ఆలోచనలో మార్పు తెచ్చింది. ఇక మీదట వరుసగా విలన్ పాత్రలను చేయాలని ఫిక్స్ అయ్యాడు సునీల్. అదే జరిగితే సునీల్ నుండి కొత్త కొత్త పాత్రలు ఆశించవచ్చు. ఆల్రెడీ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప సినిమాలో కూడా విలన్ గా సునీల్ నటిస్తాడని అంటున్నారు. సునీల్ విలన్ గా చేస్తే అది కూడా సుకుమార్ లాంటి డైరక్టర్ చేసే సినిమాలో విలన్ గా చేస్తే ఇక విలన్ గా సెటిల్ అయిపోవచ్చని చెప్పొచ్చు.

విలన్ గా మెప్పించాలే కాని తన స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రం కూడా సునీల్ కోసం సెపరేట్ గా విలన్ ట్రాక్ రాసుకుంటాడు. వారిద్దరి మధ్య బాండింగ్ అలాంటిది అని చెప్పొచ్చు. మరి విలన్ గా సునీల్ ఎలా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: