కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు.ఈ నేపథ్యంలోనే కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు లాక్ డౌన్ లోనే ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. బన్నీ కూడా పూర్తిగా పుష్ప సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా తప్పకుండా మరో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

సినిమా తరువాత బన్నీ వీలైనంత వరకు మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..ఇదిలా ఉంటె ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ బన్నీ కోసం పూర్తి కథను కూడా సిద్ధం చేశాడట. కానీ కాన్సెప్ట్, జానర్ ఏది అనే దానిపై చిన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. వీటిపై ఇప్పటికే అనేక రకాల రూమర్స్ తో అభిమానులు కొన్ని నిజమని అనుకుంటున్నారు. ఇక రీసెంట్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.ఇక సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనున్నట్లు మొదటి నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

 యువ రాజకీయ నాయకుడిగా బన్నీ సరికొత్తగా కనిపించనున్నట్లు టాక్ వస్తోంది.సినిమా ఫస్ట్ హాఫ్ ఒక కాలేజ్ యువకుడు రాజకీయ నాయకుడిగా ఎలా మారతాడు అనే కాన్సెప్ట్ లో నడుస్తుందట. ఇక సెకండ్ హాఫ్ లో రియల్ పాలిటిక్స్ ని తలపించే రేంజ్ లో బన్నీ పెర్ఫెమెన్స్ ఉంటుందని ఫైనల్ గా కొరటాల కొట్టినట్లు ఒక స్ట్రాంగ్ మెస్సేజ్ ఇస్తాడాని సమాచారం. యువకులు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనే పాయింట్ మీదనే సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు...చూడాలి మరి ఏం జరుగుతుందో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: